తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సింహయాజీకి బెయిల్​ జారీ

Bail granted to Simhayaji Swamiji: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సింహయాజీ స్వామిజీకి బెయిల్​ పత్రాలు జారీ అయ్యాయి. ఇద్దరు జామీను, రూ. 6 లక్షల పూచీకత్తుతో ఆయన్ను రేపు విడుదల చేయనున్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాంచంద్ర భారతి, నందకుమార్​లకు బెయిల్​ మంజూరు అయినప్పటికీ వారిపై బంజారాహిల్స్​ పీఎస్​లో కేసులు ఉండటంతో వారు చంచల్​ గూడ జైల్లోనే ఉన్నారు.

MLA purchase case
MLA purchase case

By

Published : Dec 6, 2022, 8:32 PM IST

Bail granted to Simhayaji Swamiji: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితుడిగా ఉన్న సింహయాజీ స్వామిజీకి బెయిల్ పత్రాలు జారీ అయ్యాయి. సింహయాజీ తరఫు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో 6 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు జామీను సమర్పించారు. దీంతో కోర్టు బెయిల్ పత్రాలు మంజూరు చేసింది. స్వామీజీ తరఫు న్యాయవాది ఈ పత్రాలను రేపు చంచల్ గూడ జైలులో సమర్పించిన తర్వాత.. జైలు అధికారులు వాటిని పరిశీలించి.. ఆయనను విడుదల చేయనున్నారు.

సింహయాజీకి గతంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికి.. పూచీకత్తు, జామీను సమర్పించడంలో ఆలస్యమైనందున విడుదల కాలేకపోయారు. దీంతో ఆరో రోజులు తరువాత ఇద్దరి జామీను, 6 లక్షల పూచీకత్తుతో రేపు విడుదల కానున్నారు. ఇదే కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాంచంద్ర భారతి, నందకుమార్​లకు సైతం హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. వీరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులుండటం వలన ఇద్దరూ చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సి వస్తుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details