తెలంగాణ మద్యం ఆంధ్రాకు గుట్టుచప్పుడు కాకుండా వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యపానం నిషేధం అమలులో ఉండటంతో... మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇదే అదనుగా తెలంగాణ మద్యాన్ని కొంత మంది అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గత ఆదివారం నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్(vadapally ps)లో విధులు నిర్వహిస్తున్న శ్రవణ్‌కుమార్ అనే కానిస్టేబుల్... పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మద్యం కాటన్లను (constable liquor smuggling)తరలిస్తుండగా గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు(dachepally police) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎస్సై విజయ్ కుమార్‌ను(si suspension) సస్పెండ్ చేశారు .
శ్రవణ్ కుమార్ అనే కానిస్టేబుల్ ఆదివారం రాత్రి డయల్ 100 విధుల్లో ఉండగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తోటి కానిస్టేబుల్‌తో అత్యవసర పని ఉందని చెప్పి అతడిని పోలీస్ స్టేషన్లో దింపి వెళ్లి.. మరలా తెల్లవారు జాము 3గంటల సమయంలో తిరిగొచ్చి విధులకు హాజరుకాలేదు. ఉదయాన్నే తనిఖీ చేయగా అతడు విధులకు హాజరు కాలేనట్లు తెలిసింది. దాచేపల్లి ఠాణా పరిధిలో లిక్కర్‌తో దొరికినట్లుగా తెలిసింది. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించడం జరిగింది. సుమారు 85 వేల విలువైన మద్యంతో దొరికినట్లుగా తెలిసింది. - సత్యనారాయణ, రూరల్ సీఐ
ఏం జరిగింది?..
వాడపల్లి పీఎస్ పెట్రోలింగ్ వాహనం ఈ నెల 14న రాత్రి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి(narketpally highway)పై తిరుగుతోంది. విధుల్లో ఉన్న శ్రవణ్‌కుమార్‌కు అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్ వచ్చింది. మద్యం సీసా కాటన్లు గల వాహనం అతని వద్దకు రాగా అందులో ఉన్న సరుకును వాడపల్లి సమీపంలో పెట్రోలింగ్ వాహనంలోకి పేర్చారు. పోలీసు వాహనం కావడంతో చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేయలేదు. సరిహద్దు దాటి రామాపురం క్రాస్‌రోడ్ వద్ద మద్యం కాటన్లను వేరే వాహనంలో వేసి వస్తుండగా గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు స్వయంగా పట్టుకున్నారు. పెట్రోలింగ్ వాహనంతో పాటు, సదరు కానిస్టేబుల్ వెంట ఉన్న మద్యం నిల్వలను దాచేపల్లి పీఎస్‌కు తరలించారు.