తెలంగాణ

telangana

ETV Bharat / crime

AP CRIME NEWS: బట్టలు దోచుకెళ్లిన పోలీసులు.. పట్టించిన సీసీటీవీ దృశ్యాలు

దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసులే చోరీకి పాల్పడి విస్మయపరిచారు. ఓ వస్త్ర దుకాణంలో ఎస్సై, కానిస్టేబుల్‌ చోరీకి పాల్పడ్డారు. ఈ సీన్​ అంతా వస్త్ర దుకాణంలోని సీసీ కెమెరాలో ఈ చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో ఆ వస్త్ర దుకాణం వ్యాపారి సీసీ కెమెరా దృశ్యాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ఎస్పీ ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ఘనకార్యం ఎక్కడ జరిగిందో మీరే చూడండి.

AP CRIME NEWS
AP CRIME NEWS

By

Published : Sep 12, 2021, 5:16 AM IST

వాళ్లిద్దరూ పోలీసులు. రోజు గస్తీ కాస్తు.. రోడ్డుపై ఉన్న ఓ షాపుపై బాగా నిఘా పెట్టినట్లున్నారు. పక్కాగా ప్లాన్ చేసుకోని అనుకున్న పనిని పూర్తి చేశారు. అయితే అసలు విషయం మర్చిపోయారు. అంతా బాగానే సెట్ చేసుకున్నారుగాని షాపులో సీసీటీవీ ఉన్న విషయాన్ని మాత్రం మర్చిపోయారు. ఇంకేముంది.. దొంగతనాలు జరిగినప్పుడు దొంగలను పట్టించే సీసీటీవీలే ఇప్పుడు పోలీసులను పట్టించేశాయి.

బట్టలు దొొంగలిస్తుండగా రికార్డైన సీసీ టీవీ దృశ్యాలు

దొంగలతో కలిసి దొచుకున్న సోమ్ములో వాటలు తీసుకునే పోలీసులను చాలా సినిమాల్లోనే చూశాం. కానీ పోలీసులు దొంగ అవతారమెత్తిన సీన్ మాత్రం ఏపీలోని చిత్తూరు జిల్లాలో చూడొచ్చు. పీవీకేఎన్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో.. ఓ వ్యక్తి బట్టల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యానులో దుస్తులు ఉంచి విక్రయిస్తుంటాడు. రాత్రి దుకాణం మూసి బట్టలన్నీ మూట కట్టి తరువాత రోజు పొద్దున్నే యథావిథిగా వచ్చాడు. చూసేసరికి బట్టలు తక్కువుగా ఉండడాన్ని గుర్తించాడు.

ఎవరికీ తెలియకుండా అమర్చిన సీసీ కెమేరా ఫుటేజీ చూసేసరికి యూనిఫాంలో ఉన్న ఎస్సై మహమ్మద్‌, కానిస్టేబుల్‌ ఇంతియాజ్‌ బట్టలు కాజేసినట్లు గుర్తించాడు. ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై స్పందించిన ఎస్పీ సెంథిల్‌కుమార్.. వస్త్రాల చోరీకి పాల్పడిన ఎస్సై మహమ్మద్‌, కానిస్టేబుల్ ఇంతియాజ్‌ను అరెస్ట్ చేశారు. విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

ఇదీ చదవండి:

Sai Dharam Tej: అతివేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం: మాదాపూర్‌ డీసీపీ

ABOUT THE AUTHOR

...view details