ఇసుక ట్రాక్టర్‌ను విడిచేందుకు 10వేల రూపాయలు లంచం తీసుకుంటూ కథలాపూర్ ఎస్సై పృథ్వీదర్ గౌడ్, రైటర్ రమేష్ ఏసీబీ అధికారులకు చిక్కారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట వాసి నాగరాజుకు చెందిన ఇసుక ట్రాక్టర్‌ను కథలాపూర్ పీఎస్ పరిధిలో పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్‌ను ఇప్పించాలని పలుమార్లు నాగరాజు పీఎస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వేడుకుంటే.. రూ.10 వేలు ఇవ్వాలని ఎస్సై పృథ్వీదర్ గౌడ్ డిమాండ్ చేశారని బాధితుడు తెలిపాడు.
BRIBE: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, రైటర్ - తెలంగాణ వార్తలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.10వేలు లంచం తీసుకుంటూ ఎస్సై పృథ్వీదర్ గౌడ్, రైటర్ రమేష్ అధికారులకు చిక్కారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, రైటర్
దీనితో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు నాగరాజు తెలిపాడు. ఆదివారం ట్రాక్టర్ కోసం నాగరాజు 10వేలు తీసుకుని పీఎస్‌కు వెళ్లగా.. ఎస్సై ఆ డబ్బును తీసుకోకుండా తన రైటర్ రమేష్‌కు ఇవ్వాలని సూచించారు. నాగరాజు రైటర్ రమేష్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై పృథ్వీరాజ్‌ను, రైటర్ రమేష్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: ACCIDIENT: డివైడర్ని ఢీకొట్టిన కారు... తల్లి, కుమారుడు మృతి..