Liquor Mafia in AP:బెల్టుషాపుతో ఇబ్బందులు పడుతున్నామని, మద్యం విక్రయించొద్దని కోరినందుకు ఓ వ్యక్తి.. సంబంధిత బెల్టు షాపు నిర్వాహకుడి చేతిలో కత్తిపోటుకు గురయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లి సీఎం జగన్ నివాసానికి సమీపంలోనే జరిగింది. సీఎం నివాసానికి సమీపంలోి ఉన్న కత్తులపేటలో సుబ్బారావు అనే వ్యక్తి గత కొంతకాలంగా గొలుసు దుకాణం ద్వారా మద్యం విక్రయిస్తున్నాడు.
దీని వల్ల తమ ఇంటికి వచ్చి మద్యం గురించి వాకబు చేస్తున్నారని, ఇది తమకు ఇబ్బందిగా ఉందని.. పొరుగున ఉన్న నాగరాజు కుటుంబం సుబ్బారావుకు చెప్పారు. అయినా వినకపోవడంతో... మద్యం విక్రయాలపై నాగరాజు పెద్దకొడుకు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సుబ్బారావును పిలిచి మందలించారు. ఆ తర్వాత కూడా సుబ్బారావు పద్ధతి మార్చుకోలేదు.