తెలంగాణ

telangana

ETV Bharat / crime

old couple died in Mahabubabad : నీ వెంటే నేనంటూ.. చితిలోనూ తోడైన దాంపత్య బంధం - old couple died in mahabubabad

old couple died in Mahabubabad: అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు వృద్ధాప్యం వరకు కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. పిల్లలకు పెళ్లి చేశారు. అవసాన దశలో ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తున్నారు. ఇంతలో అనారోగ్యంతో భార్య మరణించింది. నీవు లేనిదే నేను లేనంటూ భర్త కూడా ఆమె వెంటే కాటికి వెళ్లాడు. మృత్యువులోనూ వీరి బంధం వీడలేదు. ఈ విషాదకరమైన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది.

old couple died
మరణంలోనూ వీడని దాంపత్య బంధం

By

Published : Feb 14, 2022, 10:53 AM IST

Updated : Feb 14, 2022, 11:42 AM IST

old couple died in Mahabubabad : మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన ఎల్లబోయిన గోపాల్‌(92), మల్లమ్మ(85) భార్యాభర్తలు. వీరికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు చేశాక దంపతులిద్దరూ ఎవరిపై ఆధారపడకుండా ఒకరికొకరు తోడునీడగా జీవిస్తున్నారు.

నీ వెంటే నేనంటూ..

ఇంతలో అనారోగ్యంతో శనివారం రాత్రి భార్య మల్లమ్మ ఆకస్మాత్తుగా మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త గోపాల్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆమె మరణించిన గంట వ్యవధిలోనే 'నీ వెంటే నేనంటూ.. నిన్ను విడిచి నేను ఉండలేనంటూ' గోపాల్‌ కూడా కన్నుమూశారు. భార్యాభర్తలు ఒకే రోజు మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇన్నాళ్లు తమ కళ్లెదుట ఒకరికొకరై బతికిన వృద్ధ దంపతులు మరణించడం గ్రామస్థుల్లో విషాదం నింపింది.

Last Updated : Feb 14, 2022, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details