తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2021, 4:59 PM IST

Updated : Mar 4, 2021, 7:35 PM IST

ETV Bharat / crime

ఆర్ఎంపీ వైద్యుడి మోసాల చిట్టా.. మంత్రాలతో బంగారమట.!

పేరుకు మాత్రం ఆర్‌ఎంపీ వైద్యుడు... మోసాలు చేయడంలో మొనగాడు... ముగ్గురు సభ్యులతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని తక్కువ ధరలకే నకిలీ బంగారం బిస్కెట్లు అంటూ పలువురిని బురిడీ కొట్టించాడు. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన విచారణ బృందం మోసగాళ్ల గుట్టురట్టు చేసింది.

sajjanar, shamshabad sot
సజ్జనార్​, శంషాబాద్​ ఎస్​ఓటీ

కేసుల వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్​ సీపీ సజ్జనార్​

ఆర్‌ఎంపీ వైద్యుడు తన అనుచరులతో కలిసి పలువురికి నకిలీ బంగారాన్ని అసలుగా నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి వైద్యుడి బండారం బయటపెట్టారు. హైదరాబాద్​లోని మల్లేపల్లి ప్రాంతానికి చెందిన సయ్యద్‌ దస్తగిరి వృత్తి రీత్యా ఆర్‌ఎంపీ వైద్యుడు. షేక్‌ హఫీజ్‌, అలీ అక్భర్‌ తయ్యాబీ, మిర్జా అబ్బాస్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. దస్తగిరి తనకు మంత్ర, తంత్రాలతో భూమిలోని బంగారం బయటకు తీస్తానని ముఠా ద్వారా ప్రచారం చేసుకున్నాడు. ఇటీవల ఓ వృద్ధురాలు... తనకు నిద్రలో కలల వస్తున్నాయని ముఠాకు చెందిన సభ్యులతో తెలిపింది. ఇదే అదునుగా భావించిన వారు వైద్యుడి వద్దకు ఆమెను తీసుకువెళ్లారు. అయితే వృద్ధురాలి ఇంట్లోని భూమిలో నిధులు ఉన్నాయని వాటిని పూజలు చేయడం ద్వారా వెలికి తీయవచ్చని ఆమెను నమ్మించాడు. ఇందుకోసం రూ. 3 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతాయని తెలిపాడు. ఇందుకు ఆమె రూ. 3 లక్షలు ఇవ్వడానికి అంగీకరించింది.

నకిలీ బంగారాన్ని మూట కట్టి

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ముఠా సభ్యులు.. వృద్ధురాలి ఇంట్లో నకిలీ బంగారం దాచి ఉంచారు. భూమిలో తవ్వుతుండగా బంగారం బయటపడిందంటూ హడావుడి చేసి దొరికిన బంగారాన్ని మూటకట్టి దాచారు. తాను చెప్పే వరకు మూట తెరవవద్దని వైద్యుడు చెప్పాడు. వృద్ధురాలి కుటుంబసభ్యులు మూట తెరిచి చూసి అది నకిలీదని గుర్తించారు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిఘా ఉంచి ముఠా బండారాన్ని బయటపెట్టారు. 15 ఏళ్లుగా దస్తగిరి ముఠా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు నకిలీ బంగారాన్ని అసలైనదిగా నమ్మించి పలువురికి తులం రూ. 40వేలకు విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ముఠాలో పరారీలో ఉన్న ఫాహీం‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ తరహా ముఠాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ సూచిస్తున్నారు. అనుమానం వస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వావానాలను ధ్వంసం చేస్తున్నాడు: చర్యలు తీసుకోండి

Last Updated : Mar 4, 2021, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details