తెలంగాణ

telangana

ETV Bharat / crime

జ్యోతిష్యాలయంలో లైంగిక వేధింపులు..! - సికింద్రాబాద్ చిలకలగూడ

సికింద్రాబాద్ చిలకలగూడలో.. ఓ జ్యోతిష్యుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

sexual harrasment case filed on a Astrologer in secunderabad
జ్యోతిష్యాలయంలో లైంగిక వేధింపులు..!

By

Published : Mar 23, 2021, 7:04 AM IST

జ్యోతిష్యుడు తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగింది.

పద్మారావునగర్​లోని మారుతి జ్యోతిష్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తనపట్ల.. జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. శిక్షణ పేరుతో.. కాళ్లు, చేతులను తాకేవారని ఆరోపించింది. భర్త, సహోద్యోగులతో కలిసి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. బాధితురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఏసీబీ డీఎస్పీ పేరుతో లక్ష కాజేసిన దుండగుడు

ABOUT THE AUTHOR

...view details