ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మండలంలో.. ఆరేళ్ల బాలికపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బాలికను ఇంటి పక్కనే ఉన్న పొలంలోకి తీసుకెళ్లి.. లైంగిక దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న చిన్నారులు తల్లిదండ్రులకు తెలపడంతో.. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారిపై దాడి ఆనవాళ్లు ఉన్నాయని.. వైద్యులు నిర్ధరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు.. పోలీసులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితుడిని పట్టుకుంటామన్నారు.
Sexual assault: ఆరేళ్ల చిన్నారిపై... యువకుడు అత్యాచారయత్నం - అనంతపురం జిల్లా గుత్తి వార్తలు
ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా మైనర్లు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. నిందితులను కఠినంగా శిక్షిస్తున్నా... సమాజంలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆరేళ్ల బాలికపై 21ఏళ్ల యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అత్యాచారయత్నం