ఆడపిల్లలు, మహిళలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచిన మృగాళ్లు తెగబడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వరుసకు చిన్నాన్న అయిన వ్యక్తి కూతురు లాంటి బాలిక(16)పై లైంగిక దాడికి ( Sexual assault on a girl ) పాల్పడ్డాడు. శీతల పానీయంలో (cool drinks)మత్తుమందు కలిపి తాగించి.. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దుశ్చర్య ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై చిన్నాన్న వరుసైన వ్యక్తి(25) అఘాయిత్యం చేశాడు. శీతల పానీయంలో మత్తుమందు కలిపి తాగించి జూన్ నెల నుంచి పలుసార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
Sexual assault on girl: అమానుషం.. కూతురిలాంటి బాలికపై అఘాయిత్యం - కూతురులాంటి బాలికపై లైంగిక దాడి
ఆడపిల్లలు, మహిళలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు ( Sexual assault on a girl ) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొందరు వావివరసలు మరిచిన మృగాళ్లా తెగబడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వరుసకు చిన్నాన్న అయిన వ్యక్తి కూతురు లాంటి బాలిక(16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఏపీలో జరిగింది.
అదే సమయంలో నగ్నంగా( Nude photos) ఫొటోలు తీసి సామాజిక మాధ్యమంలో (Social Media)ఉంచాడు. బాలికకు వివాహం నిశ్చయమైన విషయం అతనికి తెలిసింది. దీంతో మీ అమ్మనాన్నలు కుదిర్చిన వివాహం చేసుకుంటే చంపేస్తానని, వారిద్దరి మధ్య జరిగింది చెబితే వారు ఆత్మహత్య (Suicide)చేసుకుంటారంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో భయాందోళనకు గురైన బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పింది.బాలిక తల్లిదండ్రుల ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం దిశ విభాగం(Disa Police) డీఎస్పీ మురళీమోహన్ గ్రామంలో కుటుంబసభ్యులను, బాధితురాలిని విచారించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి :