తెలంగాణ

telangana

ETV Bharat / crime

Student suicide attempt: తండ్రి ఇంటికి తీసుకెళ్లలేదని.. హాస్టల్​లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - తెలంగాణ వార్తలు

తండ్రి హాస్టల్​కి వచ్చి... ఇంటికి తీసుకెళ్లలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించింది(Student suicide attempt). తిర్యాని గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని పురుగుల మందుతాగి బలవన్మరణానికి యత్నించింది.

Student suicide attempt, thiryani hostel suicide attempt
హాస్టల్​లో బాలిక ఆత్మహత్య యత్నం, తిర్యాని వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 22, 2021, 12:04 PM IST

హాస్టల్​కి వచ్చిన తండ్రి ఇంటికి తీసుకెళ్లలేదనే మనస్తాపంతో... విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన(gurukula student suicide attempt) ఘటన... కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగింది. తిర్యాని గురుకుల పాఠశాల(tiryani gurukula school)లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిని చూసేందుకు... ఆదివారం తన తండ్రి హాస్టల్​కు వచ్చారు. ఈ క్రమంలో ఇంటికి తీసుకెళ్లాలని విద్యార్థిని అడగగా... సెలవులు లేవని తండ్రి నిరాకరించారు.

మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు తెలియజేయడంతో... ఆస్పత్రికి తరలించారు. అయితే పాఠశాలలోకి పురుగుల మందు ఎలా తీసుకెళ్లారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: పోలీస్​ వాహనంలో మద్యం.. ఎస్సైపై వేటు

అధికారుల నిర్లక్ష్యమా?

గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయులు, వార్డెన్ నిర్లక్ష్యానికి ఈ ఘటన నిలువెత్తు సాక్ష్యం అని స్థానికులు అంటున్నారు. గురుకుల పాఠశాలలోకి విద్యార్థిని పురుగుల మందు ఎలా తీసుకెళ్లిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా గురుకుల పాఠశాల అధికారులు మేలుకొని... ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:lb nagar car accident : తండ్రి నడుపుతున్న కారు కిందపడి ఏడాదిన్నర బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details