వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేట పట్టణకేంద్రంలో కారు బీభత్సం సృష్టించింది. పిరంగడ్డ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాన్వాయిలో వెళ్లిన వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్రావు వాహనం సారయ్య అనే వ్యక్తి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
వ్యక్తిపైకి దూసుకెళ్లిన వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ వాహనం - వర్థన్నపేటలో రోడ్డు ప్రమాదం
వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేటలో డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్రావు వాహనం బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తిని ఢీ కొట్టివెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి.
వ్యక్తిపైకి దూసుకెళ్లిన వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ వాహనం
వాహనం ఢీకోని ఒక వ్యక్తి గాయపడినా కనీసం అతన్ని ఆసుపత్రికి తరలించకుండా ఎమ్మెల్యే రమేష్, రవీందర్రావులు వెళ్లిపోవడం పట్ల స్థానికులు, సారయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి:భూ తగాదా... అన్నను నరికి చంపిన తమ్ముడు