Suicide Attempt: ఇంట్లో విషం తాగి టీవీ నటి ఆత్మహత్యాయత్నం - Tv Actress Suicide Attempt
20:52 May 30
ఎస్సార్‌నగర్‌లో టీవీ నటి ఆత్మహత్యాయత్నం
Suicide Attempt: హైదరాబాద్ ఎస్సార్ నగర్లో టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో విషం తాగి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటూ బంగారు ఆభరణాలు పోయాయని సదరు నటి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇవాళ మరోసారి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆమె... పోలీసులు స్పందించకపోవడంతో మనస్తాపం చెంది ఠాణా నుంచి ఇంటికి వచ్చి విషం తాగినట్లు తెలుస్తోంది.
ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారథి స్టూడియో వెనకాల ఉన్న ఓ అపార్ట్మెంట్లో టీవీ నటి నివాసం ఉంటోంది. పోలీసుల తీరుపై మనస్తాపం చెంది ఇవాళ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే తాను చేసిన ఫిర్యాదు విషయంలో న్యాయం జరగలేదంటూ పోలీసులకు వీడియో కాల్ చేసి లైవ్ సూసైడ్‌కు యత్నించింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆమెను నిమ్స్ దవాఖానాకు తరలించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: