ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు కేశ్యాతండాకు చెందిన భరోతు వెంకటేశ్వరరావు.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన హెడ్ కానిస్టేబుల్‌తో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాను మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు.
విజయవాడ హెడ్‌కానిస్టేబుల్ నాగబాబును.. నా భార్యను రెడ్ హ్యాండెడ్‌గా చాలా సార్లు పట్టుకున్నాను. కేసు ఎఫ్ఐఆర్ కూడా పెట్టి.. అతనిని సస్పెండ్ చేయించాను. ఇప్పుడు తన భార్య నాగబాబుతో వెళ్లిపోవడానికి సిద్ధపడి.. నాకు డివార్స్ ఇవ్వడానికి చూస్తోంది. కావాలనే పోలీసు కంప్లైంట్ ఇచ్చి నన్ను చిత్రహింసలకు గురిచేస్తోంది. హంతకుడిలాగా బేడీలు వేసి... కక్ష పెంచుకుని.. వేరు వేరు కేసులు పెట్టారు. అందరి ముందు నా పరువు తీశారు. నేను చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నా. నా చావుకు కారణం మా ఆవిడే. నా తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకోండి.