మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేయని నేరానికి జైలుకెళ్లిన... తనను, తన కుటుంబాన్ని ఏడేళ్ల క్రితం పెద్దలు కుల బహిష్కరణ చేశారు. అప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శంకర్ ఇటీవలే... పెళ్లి చేసుకున్నాడు. వివాహం తరువాతైనా జీవితం అనుకున్నట్టు సాగుతుందనుకున్న శంకర్‌కు భార్య రూపంలో మరో దెబ్బతగిలింది. పెళ్లైన మూడు రోజులకే... భార్య తనను వదిలేసి వెళ్లిపోయింది.
'ఎదురుదెబ్బలతో పోరాడలేకపోతున్నా' సెల్ఫీ వీడియోతో సూసైడ్ - muslapur suicide news
చేయని హత్య కేసులో జైలుకెళ్లాడు ఆ యువకుడు. ఆ కేసులో నిర్దోషిగా బయటకు వచ్చాడు. కుల పెద్దలు అతన్ని కులం నుంచి వెలివేశారు. ఈ లోపు ఆ యువకుడికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన మూడు రోజులకే భార్య వదిలేసింది. కోర్టు, పోలీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఆ యువకుడు సెల్ఫీ వీడియో రికార్డుతో ఈ సమాజంలో మంచి వాళ్లకు న్యాయం లేదని తన అన్నకు ఇబ్బంది పెట్టవద్దని మొరపెట్టుకొని భార్య కూడా తను అర్థం చేసుకోలేదని ఈ జీవితం ఎందుకు అంటూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే
అప్పటి నుంచి పోలీసులు, కేసులు, కోర్టుల వెంట తిరిగాడు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. భార్య విషయంలో కులపెద్దల నుంచి ఎటువంటి సహకారం అందకపోవటం వల్ల తన ఈ స్థితికి కారణమైన ముగ్గురిపై జనవరి 6న అల్లాదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. భార్య వదిలేయటం... పోలీసులు పట్టించుకోకపోవటం... సమాజం నుంచి ఎలాంటి సహకారం అందకపోవటం... ఇలా జీవితంలో ఎదుర్కొన్న ఎదురుదెబ్బల వల్ల తీవ్ర మనస్తాపం చెందిన శంకర్... ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.
ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో... తన మనోవేదనను శంకర్ వెల్లగక్కాడు. సమాజం మారిపోయిందని... బతుకు మీద ఆశ ఆవిరైందని... ఇప్పటికైనా తనను ఇబ్బంది పెట్టిన వాళ్లు కళ్లు తెరవాలని కోరుకుంటూ ఉరేసుకున్నాడు. తన అన్నయ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలని శంకర్... వీడియోలో కోరుకున్నాడు.