పేదోడికి పంచాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెంలోని ఓ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 80 క్వింటాల పీడీఎస్ బియ్యం పోలీసులకు చిక్కింది. నిందితుడితో పాటు ఓ ట్రాలీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Seize: 80 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టివేత - పీడీఎస్ బియ్యం అవినీతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. క్వింటాల్ల కొద్ది రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.
![Seize: 80 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టివేత pds rice seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:20:22:1623318622-tg-kmm-01-10-seizureofillegallystoredrice-ab-ts10145-10062021144637-1006f-1623316597-38.jpg)
pds rice seized
సత్యనారాయణ పురానికి చెందిన రాజ్ కుమార్.. కొద్ది కాలంగా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.