శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
15:08 May 07
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
అక్రమ బంగారం సరఫరాకు శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న బంగారం అక్రమ రవాణా అధికారులను సైతం షాక్కు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం దొంగచాటుగా హైదరాబాద్కు తీసుకు వస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. బిస్కెట్లు రూపంలో బంగారు ఉన్నట్లు గుర్తించారు.
ఆ బంగారం స్వాధీనం చేసుకుని తూకం వేయగా.. 2.6 కిలోలు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేల్చారు. దాని విలువ దాదాపు రూ.1.28 కోట్లు ఉంటుందని విమానాశ్రయం కస్టమ్స్ ఉపకమిషనర్ శివకృష్ణ తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
సంబంధిత కథనాలు:శంషాబాద్లో భారీగా విదేశీ బంగారం స్వాధీనం,రూ.1.35 కోట్లు విలువైన బంగారం పట్టివేత