బూందీ మాటున ఇతర దేశాలకు భారీగా విదేశీ కరెన్సీని తరలిస్తున్న మహమ్మద్ అనే వ్యక్తిని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1.3కోట్ల విలువైన అరబ్ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
రూ. 1.3 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత - భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
విదేశీ కరెన్సీని అక్రమంగా దుబాయ్‌కి తరలిస్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో అరబ్ దేశాల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
![రూ. 1.3 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత Seizure of foreign currency worth Rs 1.3 crore in shamshabad airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11147349-304-11147349-1616618139719.jpg)
హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన మహమ్మద్ దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతని లగేజీని స్కానింగ్ చేసిన సీఐఎస్ఎఫ్ పోలీసులు అందులో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి కష్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. ఆ తనిఖీలో 1.3 కోట్ల మేర విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ శివకృష్ణ తెలిపారు. పట్టుబడిన డబ్బులో కువైట్ దినార్లు, బహ్రెయిన్ దినార్లు, ఓమెన్ రియాల్స్, ఖతార్ రియాల్స్, సౌదీ రియాల్స్, యుఏఈ దీరమ్స్ తదితర దేశాలకు చెందిన కరెన్సీ ఉన్నట్లు వివరించారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
ఇదీ చదవండి:ఫ్యాన్‌కు ఉరేసుకుని బాలిక ఆత్మహత్య