రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో దాదాపు రూ.17లక్షల విలువైన సౌదీ అరేబియా రియాల్స్‌ను సీఐఎస్‌ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణీకుడిని అనుమానంపై తనిఖీలు నిర్వహించారు.
అతని సగం జీన్స్ ప్యాంటు ప్యాకెట్‌లో కొంత, మరికొంత లగేజి బ్యాగ్‌లో దాచుకుని తీసుకెళుతుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీఐఎస్‌ఎఫ్ అధికారులు వివరించారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు... విదేశీ కరెన్సీతోపాటు అతనిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.