కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం రోల్లపహాడ్లో నకిలీ విత్తనాలను (Counterfeit Seeds) నిల్వ ఉంచిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాల విలువ సుమారు రూ. 64 వేలు ఉంటుందని ఎస్సై భవాని సేన్ తెలిపారు.
Seeds Seize: నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత - నకిలీ విత్తనాలు పట్టివేత
కుమురం భీం జిల్లా రోల్లపహాడ్లో.. నకిలీ విత్తనాలు (Counterfeit Seeds) విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు చేశారు. 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Fake cotton seeds
నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి, మంచి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.
ఇదీ చదవండి:Suicide: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య