గుట్కా ప్యాకెట్లను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తోన్న ఓ ముఠాను నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల నుంచి రూ. 7 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లతో పాటు ఓ కారుని స్వాధీనం చేసుకున్నారు.
Gutka Seize: రూ.7 లక్షల విలువైన గుట్కా పట్టివేత - Prohibited Gutka Transport
నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తోన్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ గుట్కాతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగింది.
Seizure of gutka
నిందితులు.. గుట్కాను కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో తక్కువ ధరకు కొని.. స్థానికంగా ఎక్కువ ధరకు విక్రయించేవారని ఎస్సై షాకీర్ అలీ తెలిపారు. నిషేధిత గుట్కాను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Arrest: నకిలీ ఇన్‌స్టా ఖాతాలో మహిళకు వేధింపులు, వ్యక్తి అరెస్ట్