నిషేధిత గుట్కా నిల్వ ఉంచిన గోదాంపై పోలీసులు దాడి చేసి భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గుట్కాను అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి.. సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
నిషేధిత గుట్కా స్వాధీనం, ఒకరి అరెస్ట్ - Seized baned gutka
హైదరాబాద్‌లో నిషేదిత గుట్కాలను పోలీసులను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గుట్కాను అక్రమంగా హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
Seizure of banned gutka in Hyderabad
కుల్సుంపుర ముస్తాయద్‌పురకు చెందిన షకీల్ గుట్కాను గోదాంలో నిల్వచేస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా... గోదాంలో మూడు క్వింటాళ్ల గుట్కా లభించింది. ఈ మేరకు పోలీసులు షకీల్‌ను అరెస్టు చేసి గుట్కా స్వాధీనం చేసుకున్నారు.