మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ పరిధిలోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 750 బస్తాల రేషన్ బియ్యాన్ని జిల్లా సబ్ డివిజన్ అధికారి ప్రసన్న పట్టుకున్నారు. స్థానిక భాజపా నేతల సమాచారంతో దాడులు నిర్వహించి పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
750 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - irregularities in Ration rice
పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం పక్కదోవ పడుతోంది. నిత్యం ఏదో చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చట్ట వ్యతిరేక చర్యలకు కఠిన శిక్షలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ.. అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ పరిధిలోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ రేషన్ బియ్యాన్ని జిల్లా సబ్ డివిజన్ అధికారి పట్టుకున్నారు.

seizure of pds rice
తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలోనే అవినీతి జరుగుతున్నా.. పట్టించుకునే అధికారులే కరువయ్యారంటూ నేతలు మండిపడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి