తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత - హైదరాబాద్​ నేరవార్తలు

Seizure of 3,400 kg of cannabis at hyderabad
Seizure of 3,400 kg of cannabis at hyderabad

By

Published : Aug 29, 2021, 7:52 PM IST

Updated : Aug 29, 2021, 10:55 PM IST

19:50 August 29

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద 3,400 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్ శివారులోని బాహ్య వలయ రహదారి(ORR-OUTER RING ROAD) సమీపంలో ఎన్సీబీ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రక్​లో తరలిస్తున్న 3,400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గంజాయి విలువ రూ.21 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.  

మహారాష్ట్ర రిజిస్ట్రేషన్​తో ఉన్న ట్రక్​లో గంజాయి తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన అధికారులు.. 28న రాత్రి పొద్దుపోయిన తర్వాత ట్రక్​ను సీజ్ చేశారు. ట్రక్కులో పైన పూలమొక్కలు ఉంచి లోపల గన్ని బ్యాగుల్లో గంజాయిని దాచిపెట్టారు. పూల మొక్కలు తొలగించి చూస్తే గంజాయి సంచులు బయటపడ్డాయి.  

మహారాష్ట్రకు తరలించి అక్కడి నుంచి ముంబై, పుణేకు సరఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. గంజాయి స్మగ్లింగ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ముంబైలో పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అధికారులు 25 మందిని అరెస్టు చేసి, 7,500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  

ఇదీ చూడండి:Flipcart: ఫ్లిప్​కార్ట్ పార్శిళ్లలో రాళ్లు, పెంకులు... నలుగురు అరెస్ట్

Last Updated : Aug 29, 2021, 10:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details