తెలంగాణ

telangana

ETV Bharat / crime

31 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత - Seizure cotton seeds

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ విక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి హెచ్చరించారు.

నకిలీ విత్తనాల పట్టివేత
నకిలీ విత్తనాల పట్టివేత

By

Published : May 30, 2021, 10:51 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన 31 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులు.. గ్రో అవుట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విత్తనాలను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ తెలిపారు.

నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గోవింద్ హెచ్చరించారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి మంచి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.

ఇదీ చదవండి:ఎన్టీపీసీలో అగ్ని ప్రమాదం.. రూ.3 కోట్ల నష్టం

ABOUT THE AUTHOR

...view details