భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 300 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒక బొలెరో వాహనం, ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.45 లక్షల వరకు ఉంటుందని సీఐ స్వామి తెలిపారు.
300 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్ - 300 kgs of Marijuana at bhadrachalam news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు 300 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.45 లక్షల విలువ చేసే గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
![300 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్ Seizure of 300 kg of Marijuana by bhadrachalam police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11100594-543-11100594-1616332021814.jpg)
300 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్
నిందితులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని సీఐ పేర్కొన్నారు. వీరు గంజాయిని సీలేరులోని పార్వతీనగర్ నుంచి సారపాకకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. వాహనాలను సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.