తెలంగాణ

telangana

ETV Bharat / crime

30 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం పట్టివేత - యాదాద్రి భువనగిరి జిల్లా

పీడీఎస్‌ బియ్యం అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పేదలకు పంచాల్సిన రేషన్​ బియ్యం పక్కదోవ పడుతోంది. నిత్యం ఏదో చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చట్ట వ్యతిరేక చర్యలకు కఠిన శిక్షలుంటాయని పోలీసులూ హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా అక్రమ దందా ఆగకపోగా.. ఇంకా యథేచ్ఛగా వ్యాపారం కొనసాగుతోంది. ఇలాగే అడ్డగూడూరులో అక్రమంగా తరలిస్తోన్న పీడీఎస్ బియ్యం పోలీసులకు చిక్కాయి.

Seizure of 30 quintals of PDS rice in yadadri district
30 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం పట్టివేత

By

Published : Feb 14, 2021, 10:54 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో అక్రమంగా తరలిస్తున్న 30క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. డ్రైవర్​ను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

తిరుమలగిరి నుంచి మోత్కూరు వైపు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు.. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చిర్రగుడూరు స్టేజీ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నారు.

తుర్కపల్లి మండలం మర్రికుంట తండాకు చెందిన డ్రైవర్​ ధరావత్ విలియంను అరెస్ట్​ చేసి.. దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేశ్వర్ వివరించారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:తనిఖీలు నిర్వహిస్తోన్న ఎస్సైని ఢీకొట్టిన ద్విచక్రవాహనం

ABOUT THE AUTHOR

...view details