సంగారెడ్డి జిల్లా రుద్రారం శివారు లక్డారంలో అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని పోగుచేసి గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు వారు తెలిపారు.
100 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత - రేషన్ బియ్యం అక్రమ రవాణ
పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం పక్కదోవ పడుతోంది. నిత్యం ఏదో చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చట్ట వ్యతిరేక చర్యలకు కఠిన శిక్షలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ.. అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
బియ్యాన్ని నిల్వ ఉంచిన గోదాం స్థలం.. ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని తహసీల్దార్ మహిపాల్ రెడ్డి తెలిపారు. యజమానిపై కేసు నమోదు చేసి.. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:100 క్వింటాల నల్ల బెల్లం పట్టివేత