శంషాబాద్ విమానాశ్రయంలో 1.59 కిలోల బంగారం పట్టివేత - gold found at rajeev gandhi international airport
![శంషాబాద్ విమానాశ్రయంలో 1.59 కిలోల బంగారం పట్టివేత gold Seizure at Shamshabad airport hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10848549-793-10848549-1614752381042.jpg)
09:20 March 03
శంషాబాద్ విమానాశ్రయంలో 1.59 కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో 1.593 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హకీమ్పేటకు చెందిన ఓ మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించారు. పేస్ట్ రూపంలో దాచుకున్న 75 లక్షలు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
మరో వ్యక్తి దగ్గరి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన విదేశీ సిగరెట్లనూ స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
ఇవీచూడండి:శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం