తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిబంధనలు పాటించని రెండు మద్యం దుకాణాలు సీజ్ - ఖమ్మం వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నిబంధనలు పాటించకుండా... ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించి మద్యం విక్రయించిన రెండు మద్యం దుకాణాలను ఆబ్కారీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన సింగరేణి మండంలో కారేపల్లిలో చోటు చేసుకుంది.

sezied-of-two-liquor-stores-that-did-not-comply-with-the-regulations-at-khammam
నిబంధనలు పాటించని రెండు మద్యం దుకాణాలు సీజ్

By

Published : Apr 16, 2021, 12:04 PM IST

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కోడు ఉల్లంఘించిన రెండు మద్యం దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండింటిని ఎక్సైజ్​శాఖ అధికారులు సీజ్ చేశారు.

ఎన్నికల సమయంలో కారేపల్లిలోని రెండు మద్యం దుకాణాలు తెరిచి... పరిమతికి మించి మద్యం విక్రయాలు చేశాయి. దుకాణాల పరిశీలనకు వచ్చిన ఖమ్మం డీటీఎఫ్ బృందం వీరిపై కేసు నమోదు చేసింది. గతంలోనే నోటీసులు ఇచ్చామని... విచారణ పూర్తైందని అధికారులు తెలిపారు. జిల్లా ఆబ్కారీ శాఖ ఆదేశాలతో సీఐ అహ్మద్, ఎస్సై రాఘవేశ్వర దుకాణాలను తాత్కాలికంగా సీజ్ చేశారు.

ఇదీ చూడండి:విషాదం: కరోనాతో భర్త.. ఆ వార్త విని భార్య మృతి

ABOUT THE AUTHOR

...view details