వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై మిల్స్ కాలని పోలీసులు దాడులు నిర్వహించారు. వాకేరు వాగు నుంచి అర్ధరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న 30 ట్రాక్టర్లను సీజ్ చేశారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 ట్రాక్టర్లు సీజ్ - వర్దన్నపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 ట్రాక్టర్లు సీజ్
గ్రామాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రివేళల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. తాజాగా వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
![అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 ట్రాక్టర్లు సీజ్ Seize 30 tractors moving sand illegally in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10839267-226-10839267-1614681345973.jpg)
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 ట్రాక్టర్లు సీజ్
కొద్ది రోజులుగా భవన నిర్మాణ పనులు పుంజుకోవడంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా భావించిన కొందరు అర్ధరాత్రి సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికారులు చూసీ చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొన్ని వాహనాలను పట్టుకున్నా.. నామమాత్రంగానే కేసులు పెడుతున్నారు. అనంతరం జరిమానా కడితే వదిలేస్తుండటం వల్ల కొందరు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.