secunderabad violence:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. సికింద్రాబాద్ అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ఈ నెల 18న ప్రకాశం జిల్లా కంభంకు చెందిన ఆవుల సుబ్బారావు పోలీసులు అదుపులోకి తీసుకొని నరసరావుపేటకు తరలించి నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. తాజాగా సుబ్బారావును నరసరావుపేట నుంచి పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సుబ్బారావు నిర్వహిస్తోన్న సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో రేపటినుంచి సుబ్బారావును పోలీసులు ప్రశ్నించేందుకు అవకాశం ఉంది.
నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు ఆవుల సుబ్బారావు తరలింపు
secunderabad violence:ఆవుల సుబ్బారావును నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావుపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్మీ ఉద్యోగార్థులను రెచ్చగొట్టాడని ఆవుల సుబ్బారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహిస్తున్నారు.
సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో సుబ్బారావు నిర్వహిస్తోన్న సాయి డిఫెన్స్ అకాడమీలో అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్, ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని దస్త్రాలు పరిశీలించిన అధికారులు.. సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరించారు. నరసరావుపేటలో దాదాపు పదేళ్లుగా సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇన్నేళ్లుగా ఇక్కడి నుంచి ఎంత మంది ఆర్మీకి ఎంపికయ్యారు?అభ్యర్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేసేవారు? పన్నులు కడుతున్నారా?లేదా వంటి ఇతరత్రా లావాదేవీలు, శిక్షణకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీశారు. తాజాగా సుబ్బారావును హైదరాబాద్ తరలిస్తుండడంతో ఈ అల్లర్లకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.