ఎదురెదురుగా వచ్చిన లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటన సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హకీంపేట పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్కోసం వస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... వ్యక్తి మృతి - తెలంగాణ నేర వార్తలు
సికింద్రాబాద్ అల్వాల్ ఠాణా పరిధి హకీంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... వ్యక్తి మృతి
శామీర్‌పేట్‌కు చెందిన సోమయ్య మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై అల్వాల్ వైపు వస్తుండగా... పెట్రోల్ కోసం బంకులోకి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో సోమయ్య ప్రమాద స్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిని అల్వాల్‌లోని జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఆంధ్రాకు అక్రమ మద్యం.. పోలీసుల స్వాధీనం