రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ ఘటనలో విచారణ వేగంగా జరుగుతోంది. కేసుకు సంబంధించి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులిద్దరి పోలీసు కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఇద్దరినీ బుధవారం ఉదయం పది గంటల సమయంలో బోయిన్‌పల్లి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆసుపత్రిలో వైద్య చికిత్సల అనంతరం నిందితులను అపహరణ వ్యవహారంలో మరింత లోతుగా విచారించనున్నారు.
పోలీసు కస్టడీకి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు
బోయిన్‌పల్లి అపహరణ కేసులో ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ కోర్టు కస్టడీకి అనుమతించింది. అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం అనుమతిచ్చింది.
కిడ్నాప్ కేసు: పోలీసు కస్టడీకి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు
అఖిలప్రియ కూడా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు బుధవారం వాదనలు విననుంది.
ఇదీ చూడండి:కిడ్నాప్ కేసు: మరో ముగ్గురి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్