తెలంగాణ

telangana

ETV Bharat / crime

అంతయ్య ఎక్కడ... నాలుగు రోజులైనా మృతదేహం దొరకలేదు! - అంతయ్య కోసం గాలింపు

డ్రైనేజి క్లీన్ చేస్తూ.. గల్లంతైన కార్మికుడు అంతయ్య కోసం గాలింపు కొనసాగుతోంది. 4 రోజులుగా గడచినా అతని ఆచూకీ లభించకపోవటంతో అంతయ్య కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

anthaiah
అంతయ్య

By

Published : Aug 6, 2021, 2:13 PM IST

Updated : Aug 6, 2021, 2:51 PM IST

హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని సాహెబ్ నగర్​ పద్మావతి కాలనీలో మంగళవారం రాత్రి డ్రైనేజి క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్ లోపలికి దిగిన అంతయ్య, శివలు గల్లంతయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గంట పాటు శ్రమించిన పోలీసు బృందాలకు శివ మృతదేహం లభ్యమైంది. కానీ ఇంత వరకు అంతయ్య ఆచూకీ లభించలేదు.

కుటుంబసభ్యుల్లో ఆందోళన

అంతయ్య కోసం 4 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. ప్రస్తుతం పెద్ద అంబర్‌పేట్-నాగోల్ రహదారిలోని మ్యాన్‌హోల్‌లో రెస్క్యూ బృందాల గాలింపు కొనసాగుతోంది. అంతయ్య ఆచూకీ లభించకపోవడంపై కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

భద్రతా చర్యలు తీసుకోలేదు

సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా మ్యాన్ హోల్​లోకి దిగటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. రాత్రి వేళల్లోనే ఇలాంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారం అందించి న్యాయం చేయాలని కోరారు.

మా సిబ్బంది కాదు

మ్యాన్​ హోల్​లో గల్లంతైన వారు తమ సిబ్బంది కాదని జీహెచ్​ఎంసీ చెప్పింది. గుత్తేదారు ఎల్లయ్యకు సాహెబ్​నగర్, వడ్డెర బస్తీ, హరిహరపురం, బాలాజీనగర్, ఎస్‌కేడీ నగర్ తదితర కాలనీల్లోని వరదనీటి మ్యాన్‌హోళ్లు, పైపులైన్ల నుంచి పూడిక తొలగింపు కోసం రూ. 12.70లక్షలతో పనులు అప్పగించామని అధికారులు వివరించారు. బకెట్​తో మాత్రమే పూడిక తొలగించేందుకు జీహెచ్​ఎంసీ అనుమతిచ్చిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌ పూడికతీత పనులు చేయించారని అధికారులు పేర్కొన్నారు. అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి:Suicide: 'జీవితంపై విరక్తి కలిగింది'.. అన్నస్నేహితుడి ఫోన్​కు మెసేజ్.. ఆ తర్వాత!

Last Updated : Aug 6, 2021, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details