సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలోని బీరప్ప గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెందాడు. ఎదురెదురుగా వస్తున్న మినీ వ్యాన్, స్కూటీ ఢీకొన్న ఘటనలో స్కూటీపై వెళ్తున్న రేగొండ గ్రామానికి చెందిన బైకని రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కరీంనగర్లో ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడని స్థానికులు తెలిపారు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు.
గోవర్ధనగిరిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - తెలంగాణ వార్తలు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ, మినీ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మినీ వ్యాన్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదం, గోవర్ధనగిరిలో రోడ్డు ప్రమాదం
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రవి... ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులను ఆరా తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన మినీ వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.
ఇదీ చదవండి:మందుపాతరల జాడను పట్టించిన 'హీరో ర్యాట్'