సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఉప్పర్ పల్లి తండాలోని మోతీ మాత ఆలయంలో గుర్తు తెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. అమ్మవారి బంగారు ముక్కు పుడక, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 16 వేల నగదు అపహరణకు గురైనట్లు స్థానికులు తెలిపారు.
ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ - sangareddy crimes
సంగారెడ్డి జిల్లా ఉప్పర్ పల్లి తండాలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుడు అమ్మవారి ఆభరణాలతో పాటు హుండీలోని నగదు కాజేసి పరారయ్యాడు. దుండగుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
robbery in temple
దొంగ.. చోరీకి పాల్పడుతోన్న దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:online Cheating: ఇన్వర్టర్ ఆర్డర్ చేస్తే.. బండరాయి వచ్చింది!