తమ నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాల్సిన సర్పంచ్, ఉప సర్పంచ్ ముష్టిగాతాలకు దిగారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మూత్రజపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సంజీవ్, ఉప సర్పంచ్ వెంకటేష్ పరుష పదజాలంతో దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
సర్పంచ్, ఉప సర్పంచ్.. వార్డు సభ్యులతో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకున్నారు. మురుగు కాలువల నిర్మాణంపై చర్చ చేశారు. ఇందులో వారివురు చెరొకటి నిర్మాణం చేసుకుంటామని తీర్మానించుకున్నారు. దానికి సమ్మతిగా సంతకాలు చేసుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అనంతరం ఫిర్యాదు చేసుకునేందుకు కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.