హైదరాబాద్ అమీర్‌పేటలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. స్థానిక మాంగల్య వస్త్ర దుకాణం ముందు భారతమ్మ (57) అనే కార్మికురాలు రోడ్డు శుభ్రం చేస్తోంది.
గుర్తు తెలియని వాహనం ఢీ.. పారిశుద్ధ్య కార్మికురాలు మృతి - Hyderabad Latest News
అమీర్‌పేటలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
వాహనం ఢీకొనడంతో పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య