బీహెచ్ఈఎల్ పరిశ్రమలో ఉద్యోగం ఇప్పిస్తానని.. నిరుద్యోగ యువతను బురిడీ కొట్టించిన వ్యక్తిని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా కందుకూరు చెందిన యువతి.. హైదరాబాద్ నాగోల్‌లో నివాసముంటోంది. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆమె వద్ద నుంచి నిందితుడు.. పలు దఫాలుగా రూ. 5. 52 లక్షలు వసూలు చేశాడు. అనంతరం.. యువతి ఎన్నిసార్లు సంప్రదించినా, అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది.
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం.. వ్యక్తి అరెస్ట్ - telangana latest news
ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు కాజేశాడంటూ.. ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారంతో.. చంఢీగడ్‌లో ఉన్న నిందితుడిని పట్టుకుని రాష్ట్రానికి తీసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిందీ ఘటన.
ఉద్యోగాల పేరిట మోసం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారంతో.. చంఢీగడ్‌లో ఉన్న నిందితుడిని పట్టుకుని రాష్ట్రానికి తీసుకొచ్చారు. రాజేశ్.. కొంత కాలంగా ఉద్యోగాల పేరిట ఆశ చూపి ఇలాగే ఎంతోమంది నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేశాడని తెలిపారు. 10 మందికి పైగా బాధితుల నుంచి.. రూ. కోటికి పైగా డబ్బు కాజేసినట్లు దర్యాప్తులో తేలిందని వారు వెల్లడించారు. మోసగాళ్లను నమ్మ వద్దని సూచించారు.