సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ గౌడ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 5న జిల్లాకేంద్రంలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గుర్తుతెలియని దుండగులు రవీందర్ గౌడ్‌పై దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న రవీందర్‌ను.. మరుసటి రోజు ఉదయం నడకకు వచ్చిన స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించి.. అతణ్ని ఆస్పత్రిలో చేర్పించారు.
సంగారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు - murder case is solved in sangareddy
సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్‌లో ఈనెల 5న హత్యకు గురైన రవీందర్ గౌడ్ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
సంగారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఉస్మానియా ఆస్పత్రిలో.. చికిత్స పొందుతూ రవీందర్ గౌడ్ మంగళవారం రోజున మృతి చెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీకెమెరాల సాయంతో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతోనే రవీందర్‌ను హత్య చేసినట్లు నిందితుడు దర్యాప్తులో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సహకరించిన మరో వ్యక్తిని, ఆటో, కారు, మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు.