గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడి.. పోలీసుల రిమాండ్‌లో ఉన్న సర్పంచ్‌ను పదవి నుంచి తొలగిస్తూ సంగారెడ్డి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిర్దాపూర్ మండలం గర్డెగావ్ సర్పంచ్ కొండా బాలాజీ బాధ్యతాయుతమైన ప్రజాపతినిధిగా ఉండి చట్ట విరుద్ధ పనులకు పాల్పడ్డాడు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా అతనిని పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి రవాణాకు పాల్పడిన సర్పంచ్.. పదవి నుంచి తొలగింపు - gardegav sarpanch dismissed
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ప్రజలకు సేవ చేయాల్సిన సర్పంచ్ అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు పట్టుబడి.. అటు పేరుతో పాటు పదవిని పోగొట్టుకున్నాడు.
![గంజాయి రవాణాకు పాల్పడిన సర్పంచ్.. పదవి నుంచి తొలగింపు gardegav sarpanch dismissed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13436509-156-13436509-1634988271705.jpg)
గర్డెగావ్ సర్పంచి తొలగింపు
ఈ మేరకు బాలాజీని పదవి నుంచి తొలగిస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకే పదవి నుంచి తొలగించినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉప సర్పంచ్ బాబురావును ఇన్ఛార్జి సర్పంచ్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13న పెద్దశంకరంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు.. సర్పంచ్ బాలాజీని పట్టుకున్నారు.
ఇదీ చదవండి:Mallu Ravi: 'రేవంత్ రెడ్డిని చూస్తే కేసీఆర్, కేటీఆర్‌లకు వణుకు'