తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రాణాలు తీస్తున్న మొరం, ఇసుక టిప్పర్లు, లారీలు - ఇసుక లారీల ప్రమాదాలు

నిజామాబాద్ జిల్లాలో మొరం, ఇసుక లారీలు ప్రాణాలు తీస్తున్నాయి. అక్రమ రవాణాతో రోడ్లపై పరుగులు పెడుతున్న వాహనాలు అమాయకులను బలితీసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే నలుగురు మృతిచెందగా.... మూడేళ్లలో 28 మంది మరణించారు. ఇంత జరుగుతున్నా.... అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదు.

accidents
టిప్పర్లు, లారీలు

By

Published : Apr 16, 2021, 7:26 PM IST

టిప్పర్లు, లారీలు

నిజామాబాద్ జిల్లాలో మొరం, ఇసుక దందా అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. ఈ అక్రమాల్లో ఇసుక, మొరం తరలించే టిప్పర్ల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. నగర శివారులోని మల్లారం, ధర్మారం, మల్కాపూర్‌, మాక్లూర్, మోపాల్, గుడారం జాన్కంపేట్ ప్రాంతాల్లో మొరం గుట్టలు ఉన్నాయి. నిర్మాణాలకు అవసరమైన మొరాన్ని ఇక్కడి నుంచే తరలిస్తున్నారు. ఈ సమయంలోనే టిప్పర్‌ డ్రైవర్లు పోటాపోటీగా వెళ్తూ మనుషులు ప్రాణాలు తీస్తున్నారు. రోజుకు ఎన్ని ట్రిప్పులు తిప్పితే అన్ని డబ్బులువస్తాయనే ఆశతో మితిమీరిన వేగంతో టిప్పర్లు నడిపిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే నలుగురు మృతిచెందగా.. మూడేళ్లలో 28 మంది మరణించారు.

12 రోజుల వ్యవధిలో ఇద్దరు

ఈ ఏడాది జనవరి 12న డిచ్‌పల్లిలో మొరం టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మార్చి 30న నాగారం ఐదో టౌన్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మల్లారం పంచాయతీ కార్యదర్శి మొరం టిప్పర్‌ ఢీకొని దుర్మరణం చెందాడు. ఈనెల 10న ఇంద్రపూర్ కాలనీకి చెందిన నక్క కృష్ణ సైకిల్‌పై వెళ్తుండగా టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ ప్రమాదంతో పాటు... మార్చి 30న జరిగిన ఘటనకు కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ ఒక్కరే. ఈ నెల 13న మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద ద్విచక్రవాహనాన్ని మొరం లారీ ఢీకొని.... ఒక్కరు మృతి చెందారు. ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

రాత్రివేళలో అతివేగం

మొరం తరలించే లారీలే కాదు... ఇసుక లారీలు సైతం ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. నిజామాబాద్​కు 50కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా అధికారిక ఇసుక రీచ్‌లు లేవు. పలు గ్రామాల పరిధిలో వారానికి రెండు రోజులు కేవలం ట్రాక్టర్లలో తరలించాలని నిబంధనలు ఉన్నాయి. ఐతే వీటిని పక్కన పెట్టి రాత్రివేళలో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. పోలీసు లెక్కల ప్రకారమే ఏటా 70 పైగా కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు, మైనింగ్ అధికారులకు దొరకకూడదనే ఉద్దేశంతోనే రాత్రివేళల్లో టిప్పర్‌లను అతివేగంగా నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. టిప్పర్ ప్రమాదాల విషయంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అవ్వాల్సి ఉంది. పోలీసు, రెవెన్యూ మైనింగ్ రవాణాశాఖ సంయుక్తంగా తనిఖీలు చేయడం వల్ల ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​కు కొవిడ్​ పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details