నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో అనుమతులు లేకుండా దాదాపు 750 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలించారని గ్రామస్థులు వాపోయారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో మండల ఇంఛార్జి అయిన పెద్దకొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస చారిని సంఘటన స్థలానికి తీసుకొచ్చారు.
కోడేరులో అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని తహసీల్దార్ - తెలంగాణ వార్తలు
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. మండల అదనపు తహసీల్దార్‌ని సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. అనుమతి పత్రాలు ఉంటేనే ఇసుక రవాణా చేయాలని ఆయన ఆదేశించారు.
అక్రమ రవాణా, నాగర్ కర్నూల్లో అక్రమ రవాణా
అనుమతులు ఉన్నా వందల ట్రిప్పులు తరలించకూడదని తహసీల్దార్ ఆదేశించారు. అనుమతి పత్రాలు ఉంటేనే తరలించాలని అన్నారు.