జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి శివారులోని వాగు నుంచి కొందరు అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు సిద్ధం చేసి ఇసుకను తోడేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు వాగు వద్దకు వెళ్లారు.
ఇవీ చదవండి :
- SAND MAFIA: గుట్టలను మాయం చేస్తూ.. కాలువల మట్టిని కాజేస్తూ..
- కాగ్నా నదిలో ఇసుక తోడేళ్లు.. పట్టించుకోని అధికారులు
అక్రమ ఇసుక రవాణా ఆపివేయాలని హెచ్చరించిన పోలీసులపై ఇసుక మాఫియా దాడికి దిగింది. కర్రలు, రాళ్లతో పోలీసులను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకన్న గ్రామస్థులు పెద్దఎత్తున రావడం వల్ల ఇసుకాసురులు అక్కణ్నుంచి పరారయ్యారు.
- ఇదీ చదవండి :బస్తాల్లో ఇసుక విక్రయం- ప్రభుత్వం యోచన