మహబూబ్‌నగర్ జిల్లా వాడ్యాల గ్రామానికి అనుకుని ఉన్న దుందుభి వాగులో నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్నారు. అక్కడే పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు ఇసుక నింపవద్దని అడ్డుకున్నారు. ట్రాక్టర్ల యజమానులు వారిపై దాడిచేయగా.. ఒకరు తప్పించుకుని వచ్చి గ్రామస్తులకు సమాచారమిచ్చి మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కత్తులతో దాడి..
ఈ క్రమంలో ట్రాక్టర్ల యజమానులు కొందరు మధుకు ఫోన్‌చేసి రైతులపై తాము దాడి చేశామని, వీలైతే అడ్డుకోవాలని రెచ్చగొట్టడంతో జడ్చర్లలో ఉన్న మధు అర్థరాత్రి తర్వాత గ్రామానికి చేరుకున్నారు. కొందరు రైతులను కలుపుకుని వాగు వైపు వెళ్తుండగా ట్రాక్టర్ యజమానులు అడ్డుపడ్డారు. ఇరువర్గాల మధ్య పరస్పర వాగ్వాదం జరుగుతుండగా మధుపై ట్రాక్టర్ యజమానులు కత్తులతో దాడి చేశారు. నాలుగు చోట్ల కత్తులతో గాయపరచారు. తీవ్రంగా గాయపడ్డ మధును జిల్లా ఆసుపత్రికి తరలించారు.