తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tirumala Tickets: నకిలీ టికెట్ల విక్రయం.. అదుపులో నిందితులు - duplicate tickets sold by mediators

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను మోసం చేస్తూ నకిలీ టికెట్లు విక్రయించిన ఇద్దరు దళారులను అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మహరాష్ట్ర నుంచి వచ్చిన 14 మంది భక్తులకు.. నకిలీ టికెట్లు విక్రయించి మోసానికి పాల్పడ్డట్టు గుర్తించారు. ఒక్కో టికెట్ 900 రూపాయల చొప్పున 14 టికెట్లను విక్రయించారని పోలీసులు తెలిపారు.

Tirumala Tickets
నకిలీ టికెట్ల విక్రయం

By

Published : Jul 20, 2021, 7:45 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి నకిలీ టికెట్లు విక్రయించి దళారులు డబ్బులు దండుకుంటున్నారు. మహరాష్ట్ర నుంచి వచ్చిన 14 మంది భక్తులకు కొందరు నకిలీ టికెట్లు విక్రయించారు. ఒక్కో టికెట్​కు 900 రూపాయల చొప్పున... 14 నకిలీ టికెట్లను విక్రయించారు.

అవి నకిలీ టికెట్లు అని తెలియని భక్తులు... యథావిధిగా దర్శనానికి వెళ్లారు. అక్కడ తితిదే అధికారులు అసలు విషయాన్ని గుర్తించారు. భక్తులకు ఇదే విషయాన్ని చెప్పి... వారినుంచి విక్రయించిన వారి వివరాలు తీసుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తితిదే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు.. మోసాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. 20 సంవత్సరాలుగా తిరుమల - తిరుపతి మధ్య అద్దె వాహనాలు నిర్వహిస్తున్న నవనీతకృష్ణ, వేణుగోపాల్ అనే వ్యక్తులే మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:high court: 'ప్రజల ప్రాణాలు పోతుంటే రోడ్ల మరమ్మతులకు దశాబ్దాలు కావాలా?'

ABOUT THE AUTHOR

...view details