ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లూరుకు చెందిన కోణాల వెంకట భాస్కరరావు.. స్థానికంగా ఉన్న గ్రామ సచివాలయంలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగరీత్యా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని పలుమార్లు తన భార్య వద్ద వాపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 25న భాస్కరరావు అతని సోదరుడు నాగ సూర్యనారాయణ మూర్తి నివాసానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పురుగుల మందు తాగి సచివాలయ ఉద్యోగి బలవన్మరణం - ap news
పని ఒత్తిడి తాళలేక సచివాలయ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా మీనవల్లూరులో జరిగింది.
suicide, sachivalayam employe died
గమనించిన సోదరుడు.. భాస్కరరావును ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాస్కరరావు.. ఆదివారం మృతి చెందాడు. ఊహించని ఈ ఘటనతో భాస్కరరావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: మద్యం మత్తులో 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్