Mahesh Bank Server hack Updates : మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కేసులో రష్యా, చైనా హ్యాకర్ల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సర్వర్‌ను హ్యాక్ చేసేందుకు నైజీరియన్లకు రష్యా, చైనా హ్యాకర్లు సహకరించారనే అనుమానాలను సైబర్ క్రైం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఖాతాదారుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Mahesh Bank Server hack Updates : మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్‌లో.. రష్యా, చైనా హ్యాకర్ల హస్తం! - మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో రష్యా, చైనా హ్యాకర్లు
Mahesh Bank Server hack Updates : మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హ్యాకింగ్ వెనకు నైజీరియన్లే గాక.. రష్యా, చైనా హ్యాకర్ల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఖాతాదారుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Russia and China Hackers in Mahesh Bank Case : షానవాజ్ అనే మహిళ ఖాతాలో 6.9కోట్లను సైబర్ నేరగాళ్లు జమచేశారు. ఆ తర్వాత వివిధ ఖాతాల్లోని నగదు మొత్తాన్ని బదిలీ చేశారు. మహేశ్ బ్యాంకు ఐటీ నిపుణులు.. షానవాజ్ ఖాతాలో నిల్వలు అమాంతం పెరగడాన్ని గుర్తించి బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. బ్యాంకు రికార్డుల్లో ఉన్న ఫోన్ నెంబర్‌కు సిబ్బంది ఫోన్‌చేసి ఆమెతో మాట్లాడారు. చిరునామా, ఇతర వివరాలను బ్యాంకు సిబ్బంది కనుక్కునే ప్రయత్నం చేయగానే సదరు మహిళ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసినట్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. షానవాజ్ అనే మహిళ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆమెకు సైబర్ నేరగాళ్లకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 12.4కోట్ల రూపాయలను ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని 120కి పైగా ఖాతాలకు సైబర్ నేరగాళ్లు బదిలీ చేశారు. ఆయా ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలను సైబర్ క్రైం పోలీసులు సేకరిస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!