తెలంగాణ

telangana

ETV Bharat / crime

RTC Conductor Died: టికెట్లు ఇస్తూనే... బస్సులో మహిళా కండక్టర్ మృతి - గుండెపోటుతో మహిళా కండక్టర్ మృతి

RTC Conductor Died: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ నుంచి నల్గొండకు వెళ్తున్న బస్సులో... మహిళా కండక్టర్‌ గుండెపోటుతో మృతిచెందింది. విధినిర్వహణలో హఠాత్తుగా ఆమె మృతి చెందడంతో వారింట విషాదఛాయలు అలముకున్నాయి.

Rtc Conductor Died
Rtc Conductor Died

By

Published : Mar 29, 2022, 5:59 PM IST

RTC Conductor Died: నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో మిర్యాలగూడ నుంచి నల్గొండకు వెళ్తున్న ఆర్​టీసీ బస్సులో ప్రయాణికులకు టిక్కెట్లు ఇస్తూనే ఓ మహిళా కండక్టర్ గుండెపోటుతో మృతి చెందింది.

టికెట్లు ఇస్తూనే...

నల్గొండ జిల్లాలోని హాలియాకు చెందిన భారతి అనే మహిళా మిర్యాలగూడ డిపోలో కండక్టర్​గా విధులు నిర్వహిస్తోంది. ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి నల్గొండకు బస్సు ప్రయాణికులతో బయల్దేరింది. ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్న కండక్టర్ భారతికి వేములపల్లి శివారులో హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.

అనంతరం ఆమె మృతదేహాన్ని మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో కార్మికుల సందర్శనార్థం ఉంచారు. ఆ తరవాత స్వగ్రామమైన హాలియాకు తరలించారు. కండక్టర్ భారతికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురుకి పెళ్లి కాగా, రెండో కూతురు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. విధినిర్వహణలో హఠాత్తుగా గుండెపోటుతో ఆమె మృతి చెందడంతో వారింట విషాదఛాయలు అలముకున్నాయి.

ఇదీ చదవండి:గేదెను తప్పించబోయి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 13 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details